విశాఖ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎస్పీ అట్టాడ బాబూజీ అన్నారు. మావోయిస్టులు ఓటింగ్ బహిష్కరించినా గిరిజనులు స్వేచ్ఛగా ఓటు వేశారని చెప్పారు. పోలింగ్ కు ముందు పెదబయలు వద్ద మందుపాతర నిర్వీర్యం చేశామన్నారు. ఈ సారి సాంకేతిక వినియోగంతో పోలింగ్ సురక్షితంగా జరిగిందని... ప్రజలు మావోయిస్టుల పిలుపును తిప్పికొట్టారని ఎస్పీ ప్రశంసించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పూర్తి కావాల్సిన ఓటింగ్... సాంకేతిక ఇబ్బందులతో రాత్రి 11 గంటల వరకు జరిగినా... ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. ఎన్నికలు సజావుగా జరగడం ప్రజల సమష్టి విజయమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా 7 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవటంతో పాటు... 587 మద్యం కేసులు, 11వేల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇవి చూడండి...