తెలుగు భాష మీద దాడి చేసేందుకు ప్రభుత్వం విఫలయత్నం చేస్తోందని తెలుగు దండు సంస్థ అధ్యక్షుడు పరవస్తు ఫణిశయన సూరి ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విశాఖ మద్దిలపాలెం కూడలిలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద 'అమ్మ భాషకు వందనం' కార్యక్రమం నిర్వహించారు. మాతృ భాష మీద దాడి చేయడమంటే ఆ జాతి మీద పెత్తనం చేయడమేనని ఆయన మండిపడ్డారు.
ప్రాథమిక విద్య నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి సంస్కృతి, చరిత్ర, ఆత్మగౌరవం దెబ్బతీసే ప్రయత్నం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భవిష్యత్తు తరాల్ని మాతృభాషకు దూరం చేయడం క్షమించరాని నేరమని ఫణిశయన సూరి తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు, కళాకారులు మాతృ భాషలు వర్ధిల్లాలని, తెలుగు భాషను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేమని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: