ETV Bharat / state

'రూ.44800 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాం'

పెట్టుబడులను ఎక్కువగా ప్రైవేటు రంగాల నుంచి తీసుకోవడమే తమ లక్ష్యమని విశాఖ పోర్టు ఛైర్మన్ రామ్మోహనరావు అన్నారు. విశాఖలో వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న మారిటైమ్ ఇండియా సమ్మిట్​లో ఆయన మాట్లాడారు.

vishakha
'రూ.44800 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాం'
author img

By

Published : Mar 4, 2021, 12:05 PM IST

రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పత్తులను పోర్టుల ద్వారా ఎగుమతులు చేసే అవకాశం ఉందని విశాఖ పోర్టు ఛైర్మన్ కె.రామ్మోహ‌న‌రావు అన్నారు. కేంద్ర రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న మారిటైమ్ ఇండియా సమ్మిట్ -2021లో పోర్టు అధారిత అభివృద్ది, పోర్టు నగరాల నిర్మాణం, మారీటైమ్ క్లస్టర్స్ అనే అంశంపై జ‌రిగిన చ‌ర్చలో ఆయ‌న ప‌లు అంశాల‌ను వివ‌రించారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో జ‌రిగిన ఈ స‌ద‌స్సులో మాట్లాడిన పోర్టు ఛైర్మన్.. ఏయే దేశాల నుంచి పెట్టుబడులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న అంశంపై చ‌ర్చ జ‌రిగిన‌ట్టు చెప్పారు.

విశాఖ పోర్టు మొత్తం 44800 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుందన్నారు. ఫిషింగ్ హార్బర్​కు సంబంధించి కీలకమైన చర్చ జరిగిందని.. ఇప్పటికే కేంద్రం ఫిషింగ్ హార్బర్​ అభివృద్దికి 100 కోట్లు కేటాయించిందని చెప్పారు. మరిన్ని పెట్టుబడులను ప్రైవేటు రంగం నుంచి తీసుకోవాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. ఆంధ్రప్రదేశ్​కు ఎక్కువ పెట్టుబడులు తెచ్చి తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే అంశంపై ముఖ్యమంత్రి కూడా దిశా నిర్ధేశం చేశారని ఆయన తెలిపారు. పోర్టు డిప్యూటీ ఛైర్మన్ దుర్గేష్ కుమార్ దూబె స‌హా పోర్టు విభాగాధిపతులు పాల్గొన్నారు. విదేశాలకు చెందిన ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సదస్సులో పాల్గొని ప్రసంగించారు.

ఇదీ చదవండి: 'ఫిర్యాదులను ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.