అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను మెరైన్ పోలీసులు రక్షి౦చారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని రత్నాయంపేట సముద్ర తీరాన... ఈ ఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఈ తీరానికి వచ్చారు. ఒక్కసారిగా భారీ కెరటం రావడం వారిలో ఇద్దరు లోనికి కొట్టుకుపోయారు. పెట్రోలింగ్ చేస్తున్న పెంటకోట మెరైన్ పోలీసులు తక్షణ౦ స్పందించి వారిని రక్షి౦చి ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.
ఇదీ చదవండీ...కూలీల ఆటో బోల్తా.. మహిళ మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం