విశాఖ జిల్లాలో 1638 కిలోల గంజాయి స్వాధీనం డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఒక సరకుల వ్యాన్‌తో పాటు, మరో కారును సీజ్ చేశారు. ఎన్ఏడీ జంక్షన్ లో నిన్న ఈ వాహనాలను పట్టుకున్నట్టు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. పూర్తిగా ప్యాక్ చేసిన 40 బ్యాగులను అరటి గెలల వ్యాన్ లో గుర్తించామని...మెుత్తంగా 800 ప్యాకెట్లలో గంజాయి ఉన్నట్లు తెలిపారు. నర్సీపట్నంలో లోడ్ చేసి అనకాపల్లిలో ఒక డ్రైవర్ కి అప్పగించేందుకు యత్నించినట్టు గుర్తించామన్నారు. సీజ్ చేసి గంజాయి విలువ రెండు కోట్ల 45 లక్షలు ఉంటుందని చెప్పారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు డిఆర్ ఐ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎందరికి ప్రమేయం ఉందన్నది గుర్తిస్తామని అధికారులు అన్నారు.
భారీగా గంజాయి పట్టివేత - Marijuana addiction in vishaka district
విశాఖ జిల్లాలో 1638 కిలోల గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి విలువ 2కోట్ల పైనే ఉంటుందని అధికారులు తెలిపారు.
విశాఖ జిల్లాలో 1638 కిలోల గంజాయి స్వాధీనం డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఒక సరకుల వ్యాన్‌తో పాటు, మరో కారును సీజ్ చేశారు. ఎన్ఏడీ జంక్షన్ లో నిన్న ఈ వాహనాలను పట్టుకున్నట్టు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. పూర్తిగా ప్యాక్ చేసిన 40 బ్యాగులను అరటి గెలల వ్యాన్ లో గుర్తించామని...మెుత్తంగా 800 ప్యాకెట్లలో గంజాయి ఉన్నట్లు తెలిపారు. నర్సీపట్నంలో లోడ్ చేసి అనకాపల్లిలో ఒక డ్రైవర్ కి అప్పగించేందుకు యత్నించినట్టు గుర్తించామన్నారు. సీజ్ చేసి గంజాయి విలువ రెండు కోట్ల 45 లక్షలు ఉంటుందని చెప్పారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు డిఆర్ ఐ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎందరికి ప్రమేయం ఉందన్నది గుర్తిస్తామని అధికారులు అన్నారు.
ఇదీ చూడండి:'ఎలాగైనా వెళ్తాం.. ఎలా అడ్డుకుంటారో చూస్తాం'
TAGGED:
భారీగా గంజాయి పట్టివేత