పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల సంతబయలులో చోటు చేసుకుంది. మంగళవారం జరిగే సంతబయలులో ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతను జి.మాడుగుల మండలం ఈదులుబయలు గ్రామవాసి వంతాల చిన్నయ్యగా పోలీసులు గుర్తించారు. ఆటోలో నలుగురు వ్యక్తులు చిన్నయ్యను తీసుకువచ్చి కర్రలతో కొట్టి పడేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఇదిచూడండి.ఆగస్టు నుంచి "ఆశా"లకు పెరిగిన వేతనం