విశాఖ మన్యంలో మైనింగ్ మాఫియా(mining mafia) కొనసాగుతోందని మావోయిస్టులు(naxals) ఆరోపించారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ మైనింగ్(bauxite mining) జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ మాఫియా చర్యలకు నిరసనగా ఈ నెల 10న బంద్‌కు పిలుపునిచ్చారు.
వందల ఎకరాల్లో మైనింగ్ మాఫియా జరుగుతోంది
విశాఖ-తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులో నాతవరం మండలం భమిడికలొద్ది సమీపంలో.. వందల ఎకరాల్లో లేటరైట్ ముసుగులో బాక్సైట్ మైనింగ్ జరుగుతోందని మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ ఆపాలని, బాక్సైట్ తరలింపు కోసం వేసిన రోడ్లు ఆపాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ మైనింగ్‌కు వాడుతున్న యంత్రాలను, మైనింగ్ చేస్తున్న వారిని ఏజెన్సీ నుంచి తరిమేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలకు ప్యాకేజీల పేరుతో తాయిలాలు ఇస్తూ, ఆదివాసీల బతుకులు చీకటి చేసేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు.. ఆగస్టు 10 రాష్ట్రవ్యాప్త బంద్ పాటించాలని ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ గణేష్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
ఇదీ చదవండి: