విశాఖ జిల్లా మాడుగుల పోలీసులు రెండోరోజు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సై రామారావు, సిబ్బంది కలిసి మండల వ్యాప్తంగా వీధి బాలలు గుర్తింపునకు ఆపరేషన్ ముస్కాన్ విస్తృతంగా నిర్వహించారు. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, ఇటుక బట్టీల ప్రాంతాల్లో పర్యటించి.. 18 ఏళ్లలోపు పలువురి పిల్లలను గుర్తించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించి.. పిల్లలను పనిలో పెట్టొద్దని చదివించాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. నిరుపేద పిల్లలను చదివించడానికి సహకారాన్ని అందిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండీ… నేడు ప్రకాశం పంతులు వర్ధంతి.. చంద్రబాబు నివాళి