విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు దేవరాపల్లి మండలంలోని తన స్వగ్రామం తారువలో హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. నియోజకవర్గంలో కరోనా వైరస్ పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తారువ కార్యాలయానికి రావొద్దని, ఫోన్లో ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారని వెల్లడించారు.
ఇదీ చదవండి : రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని సీఎం జగన్కు కన్నా లేఖ