ETV Bharat / state

పరవాడలో ఎల్పీజీ లోడ్‌ ట్యాంకర్‌ బోల్తా.. బాట్లింగ్‌ కంపెనీ వద్దే ప్రమాదం - lpg gap

lorry accident at parawada
పరవాడలో ఎల్పీజీ లోడ్‌ ట్యాంకర్‌ బోల్తా..
author img

By

Published : Dec 27, 2021, 9:30 AM IST

Updated : Dec 28, 2021, 7:37 AM IST

09:27 December 27

పరవాడలో ఎల్పీజీ లోడ్‌ ట్యాంకర్‌ బోల్తా

పరవాడలో ఎల్పీజీ లోడ్‌ ట్యాంకర్‌ బోల్తా

విశాఖ పరవాడ ఫార్మాసిటీలోని ఇండియన్ ఆయిల్ గ్యాస్ స్టేషన్ వద్ద సోమవారం తెల్లవారుజామున గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. ఉదయం 5.15 గంటలకు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పరవాడ విపత్తు నిర్వహణ శాఖ, విశాఖ జిల్లా విపత్తు నిర్వహణ శాఖ సంయుక్తంగా సహాయక చర్యలు మొదలుపెట్టారు. సుమారు 9 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి ట్యాంకర్​ను సురక్షితంగా తరలించారు.

ట్యాంకర్​ను క్రేన్ సహాయంతో పైకి లేపుతున్నపుడు గ్యాస్ లీక్ లీకైంది. గ్యాస్‌ లీక్‌తో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే కంపెనీ సిబ్బంది గ్యాస్​ లీక్​ను అదుపు చేశారు. ట్యాంకర్​ను పైకి లేపి ఐఓసి ప్లాంట్​లోకి తీసుకెళ్లి.. మరో ట్యాంకర్​లోకి గ్యాస్​ లోడ్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్​లో మూడు ఫైర్ ఇంజిన్లు పాల్గొన్నాయి. మంచు, రోడ్డు పక్కన తుప్పలు, రోడ్డు బురదగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రమాద సమయంలో ట్యాంకర్​లో 17 టన్నుల గ్యాస్​ ఉందని అధికారులు తెలిపారు. వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి:

Gazette Implementation: బోర్డుల పరిధి అమలుతీరుపై కేంద్రం అసంతృప్తి.. రేపు సీఎస్​లతో భేటీ

Last Updated : Dec 28, 2021, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.