విశాఖ జిల్లా ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు చంద్రశేఖర్ రావు మారికవలస నుంచి తన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా పొత్తూరు మండలం వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొనటంతో చనిపోయాడు. ఆనందపురం పోలీసులు కేసు నమోదుచేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి