విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. కె.కోటపాడు, చీడికాడ, దేవరాపల్లి, మాడుగుల మండలాల్లో .. కరోనా కేసులు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి ప్రమాద కరంగా మారడంతో వ్యాపారులు, గ్రామాల పెద్దలు స్వచ్ఛంద లాక్ డౌన్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని మాడుగుల, దేవరపల్లి, కె.కోటపాడు, చీడికాడ మండలాల్లోని స్వచ్ఛంద లాక్ డౌన్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో మధ్యాహ్న సమయంలో కర్ఫ్యూ వాతావరణం తలపిస్తుంది. ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని ఆటోలపై ప్రచారం చేస్తున్నారు.
మాడుగుల నియోజకవర్గంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్
కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతుంది. మాడుగుల నియోజకవర్గంలో దీని తీవ్రత చాలా ఎక్కువుగానే ఉంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో స్వచ్ఛంద లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.