ETV Bharat / state

'రిజర్వాయర్​ పరివాహక ప్రాంతాల్లో మైనింగ్​ అనుమతులు రద్దు చేయాలి' - కళ్యాణ లోవ రిజర్వాయర్​ తాజా వార్తలు

కళ్యాణ లోవ రిజర్వాయర్​ పరివాహక ప్రాంతాల్లో మైనింగ్​ అనుమతులు రద్దు చేయాలని అఖిల పక్షాల ఐక్య వేదిక ధర్నా చేపట్టింది. చీమలపాడు ఫారెస్ట్​ మైనింగ్​ అనుమతులు ఇచ్చిన అధికారులను శిక్షించాలని డిమాండ్​ చేశారు.

left parties protest on chimalapadu mining issue
ధర్నా చేపట్టిన అఖిల పక్షాల ఐక్య వేదిక
author img

By

Published : Oct 5, 2020, 6:06 PM IST

కళ్యాణ లోవ రిజర్వాయర్​ పరివాహక ప్రాంతాల్లో మైనింగ్​ అనుమతులను రద్దు చేయాలంటూ అఖిల పక్షాల ఐక్య వేదిక ధర్నా చేపట్టారు. అనకాపల్లి మైన్స్​ ఏడీ కార్యాలయం వద్ద తమ నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్​, బీఎస్పీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చీమలపాడు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్​ 3 నుంచి 7 వరకు దొంగ రెవెన్యు సర్వే నెంబర్​లు సృష్టించి ఇచ్చిన మైనింగ్​ లీజులను రద్దు చేయాలన్నారు. తమను సంప్రదించకుండా రవాణా పర్మిట్లు ఇవ్వొద్దని ఆటవీశాఖ డీఎఫ్​వో అనకాపల్లి మైన్స్​ ఏడీకి సూచించినా... రవాణా పర్మిట్లు ఇచ్చారంటూ అఖిల భారత వ్యవసాయం గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి అజయ్ కుమార్ ఆరోపించారు. దీనిపై విచారణ చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

బకాయి సొమ్ము చెల్లించాలంటూ కార్మికుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.