Left Parties Protest : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దంటూ మద్దిలపాలెం సమీపంలో వామపక్షాల నిరసన చేపట్టాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్ష నాయకులు నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వామపక్ష నాయకులను అరెస్టు చేశారు. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దంటూ స్టీల్‌ప్లాంట్ పరిపాలనా భవనం వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. కార్మిక నాయకులను అక్రమంగా అరెస్టు చేశారంటూ నినాదాలు చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: