పెరిగిన చమురు ధరలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించి పేదలపై భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లాలో..
పెట్రోలు ధరల పెంపుపై గన్నవరంలో వామపక్ష నాయకులు నిరసన తెలిపారు. కేంద్రం... ఇష్టం వచ్చినట్లుగా పెట్రోలు, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు వేసిందని సీపీఎం మండల కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు విమర్శించారు. కరోనాతో జనాలు అల్లాడుతుంటే పెట్రోలు, గ్యాస్ భారాలతో మరింత కుంగదీస్తున్నారని మండిపడ్డారు.
విజయవాడలో సీపీఐ నాయకులు చమురు ధరల పెంపుపై ఆందోళన చేశారు. కరోనా ప్రభావంతో ఆర్థిక కష్టాల్లో ఉన్న సామాన్యులు మరింత ఇబ్బంది పడేలా ధరలు పెంచుతున్నారని ఆగ్రహించారు. ధరలు తగ్గించకుంటే రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పార్టీ నగర కార్యవర్గ సభ్యులు భాస్కర రావు హెచ్చరించారు.
అనంతపురం జిల్లా...
పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును నిరసిస్తూ అనంతపురం జిల్లా తనకల్లులో సీపీఎం ధర్నా చేపట్టింది. కొవిడ్ 19 కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదలపై పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచుతూ భారం మోపుతోందని నాయకులు విమర్శించారు.
విశాఖ జిల్లా...
పెట్రోల్ ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా అనకాపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.రోజు రోజుకి పెట్రోలు,డీజిల్ ధరలు పెంచుతూ భాజపా... సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెను భారం మోపుతోందని విమర్శించారు.
ఇదీ చదవండి: