ETV Bharat / state

SPICEJET: విశాఖ-ముంబై స్పైస్ జెట్ విమాన సర్వీసు ప్రారంభం - SpiceJet operates flights from Visakhapatnam to Mumbai

విశాఖ నుంచి ముంబైకి కొత్తగా స్పైస్ జెట్ విమాన సర్వీసు ప్రారంభం అయింది. ఇది ఒక గంటా 55 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకుంటుందని స్పైస్ జెట్ వెల్లడించింది. ప్రజలందరికీ అందుబాటు ధరలో ఈ విమాన సర్వీసు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

SpiceJet flight service
స్పైస్ జెట్ విమాన సర్వీసు
author img

By

Published : Sep 15, 2021, 3:47 PM IST

విశాఖ నుంచి ముంబైకి కొత్తగా స్పైస్​ జెట్​ విమాన సర్వీసు ఆరంభమైంది. ముంబైలో ఉదయం 5.40 గంటలకు బయలుదేరి 7.25 గంటలకు విశాఖ చేరుతుంది. మళ్లీ 7.55 గంటలకు బయలుదేరి తిరిగి 9.50 గంటలకు ముంబై చేరుతుంది. ఒక గంటా 55 నిమిషాలను ప్రయాణ కాలంగా స్పైస్ జెట్ వెల్లడించింది.

విశాఖపట్నం విమానాశ్రయ ఆవరణలో జరిగిన ఈ స్పైస్ జెట్ విమాన ప్రారంభ కార్యక్రమానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేశ్​ కుమార్​ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఎయిర్ పోర్టు డైరక్టర్ కె.శ్రీనివాసరావు, స్పైస్ జెట్ సంస్ధ ప్రతినిధులు హాజరయ్యారు. విశాఖపట్నం అభివృద్ది చెందుతున్న తరుణంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలందరికీ అందుబాటు ధరలో ఈవిమాన సర్వీసు ఉపయోగకరంగా ఉంటుందని వాసుపల్లి అన్నారు. కొవిడ్ తర్వాత సర్వీసులు పెరగడం వల్ల వాణిజ్య అవసరాలు కొంతవరకు తీరుతాయన్నారు.

ఇదీ చదవండీ.. 'సాక్షి'పై కోర్టు ధిక్కరణ కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.