విశాఖ సింహాచల నృసింహ స్వామివారి దేవస్థానంలో అన్నప్రసాదం, స్వామివారి ప్రసాదాల తయారీలో సాంకేతికతను వినియోగించానున్నారు. ఈ మేరకు ట్రస్టు బోర్డు ఛైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు సూచనలతో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రమంలో ఔత్సాహిక సంప్రదాయ ఆధ్యాత్మికవాదుల నుంచి వంటశాల ఆధునికీకరణకు అవసరమైన ఆకృతుల(డిజైన్ల)ను ఆహ్వానిస్తూ దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రసాదాల్లో నాణ్యత పెంపుదల, పరిశుభ్రత, అవసరమైన పరిమాణంలో వేగంగా భక్తులకు అందేలా సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలిపారు. ఔత్సాహికుల నుంచి ఆకృతుల ఆహ్వానం www.tender.apeprocurement.gov.in లను సందర్శించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు దేవస్థానం ఏఈపీ రవిరాజును 96180 72527 నెంబరులో సంప్రదించవచ్చునన్నారు.
ప్రసాదాల కొరత రాకుండా...
సింహాచలం దేవస్థానంలో తరచూ ప్రసాదాల కొరత భక్తులను వేధిస్తోంది. నిత్యం 15 వేల పులిహోర పొట్లాలు, 20 వేల లడ్డూలు తయారవుతున్నాయి. అంతకు మించి డిమాండ్ ఉంటున్న కారణంగా తయారీని పెంచాలంటే సాంకేతికతను వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. సింహగిరిపై ఉన్న అన్నప్రసాద భవనంపై మరో అంతస్తు నిర్మించాలని ప్రతిపాదించారు. అక్కడ యంత్రాలను సమ కూర్చి ప్రసాదాల తయారీ పెంచనున్నారు. ఆలయ అవసరాల మేరకు డిజైన్లు అందించవచ్చని పేర్కొన్నారు. ఆయా డిజైన్లకు దేవస్థానం పారితోషికం ఇవ్వబోదని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం దేవస్థానం వెబ్సైట్ www.simhachalamdevasthanam.net ను సందర్శించాలని తెలిపారు. ఔత్సాహిక నిపుణులు పంపించవచ్చని ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు.
ఇదీ చదవండి: