విశాఖ జిల్లాలో నీటి ఎద్దడి నెలకొంది. పరిశ్రమల నిర్వహణకు నీటి వసతి లేక సమస్యాత్మకంగా మారింది. గోవాడ చక్కెర కర్మాగారంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. రోజుకు మూడు లక్షల లీటర్ల నీరు అవసరం ఉండగా... 2 లక్షల 25 వేల లీటర్ల నీరే అందుతోంది. ప్రత్యామ్నాయ చర్యల వైపు యాజమాన్యం దృష్టి సారించింది. ఇప్పటికే కర్మాగారంలో 5 బోర్లు ఉండగా మరో 2 బోర్లు వేస్తున్నారు. నీటి ఎద్దడి నివారణకు రైవాబ జలాశయం నీటిని శారదా నదికి విడుదల చేయాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు కర్మాగారం యాజమాన్య సంచాలకులు విక్టర్ రాజు తెలిపారు.
ఇదీ చదవండి