రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులపై ప్రభుత్వం స్పందించాలని అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత డిమాండ్ చేశారు. దేవాలయాలపై వరుస దాడులు జరుగుతుంటే నిఘా వ్యవస్థ ఏంచేస్తోందని ఆమె ప్రశ్నించారు. రామతీర్ధం లాంటి పవిత్ర పుణ్య క్షేత్రాలు పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా దాడి జరిగిందని అన్నారు.
ఇదీ చదవండి: 'రామతీర్థం సందర్శనకు అనుమతి ఇవ్వాలి'