విశాఖ జిల్లా అరకులోయ వరకు ప్రయాణించే కిరండూల్ రైలుకు ఈనెల 18నుంచి మళ్లీ అద్దాల బోగీని పునరుద్ధరించనున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా బోగీని తొలగించామని, పర్యాటకుల రద్దీ దృష్ట్యా పునరుద్ధరించున్నట్లు వివరించారు. స్లీపర్ కోచ్, హాల్ట్లను సైతం అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేశారు. ఇకపై ఎస్.కోట బొర్రా గుహల్లో రైలును నిలుపుతామని పేర్కొన్నారు. పర్యాటకులు కరోనా నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: విశాఖలో 'రౌడీ బేబీ' షూటింగ్ ప్రారంభం