విశాఖలో కొవిడ్ కేసుల సంఖ్య వందకు చేరుకుంది. బుధవారం ఒక్కరోజే కొత్తగా పది కేసులు నమోదయ్యాయి. గురువారం కూడా మరికొన్ని కేసులు నిర్ధరణ కావడం వల్ల అధికార్లు మరింత అప్రమత్తం అయ్యారు. కింగ్ జార్జి ఆసుపత్రిలో హృద్రోగ సంబంధ సమస్యతో ఇన్ పేషెంట్‌గా చేరిన మహిళకు కరోనా సోకడంపై.. ఆ విభాగంలో ఆందోళన నెలకొంది.
మహిళకు చికిత్స చేసిన ప్రొఫెసర్, పది మంది వైద్యులు, మిగిలిన సిబ్బంది మొత్తం 40 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా వీరిని క్వారంటైన్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళకు చికిత్స చేసిన కేజీహెచ్‌లోని రాజేంద్రప్రసాద్ వార్డును పూర్తిగా శానిటైజ్ చేసి, మూడు రోజుల వరకు మూసేస్తున్నట్టు సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున వెల్లడించారు.
ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే వారు ముందుగా కొవిడ్ పరీక్షలు చేయించుకుంటే.. ఇటువంటి ఘటనలు నివారించవచ్చని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: