కార్తీక మాసం రెండో సోమవారం పురస్క రించుకుని విశాఖ జిల్లా అనకాపల్లి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దలింగేశ్వర, భోగ లింగేశ్వర, ఉమా రామలింగేశ్వర, కాశీ విశ్వేశ్వర స్వామి కోవెలల్లో ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీపాలు వెలిగించారు. అభిషేకాలు నిర్వహించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: