ETV Bharat / state

'ఈ బార్​లో రోజంతా అమ్మకాలు.. వెంటనే సీజ్ చేయండి'

సమయానికి మించి మద్యం అమ్మకాలు చేపడతున్నారని విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలోని ఓ బార్​ ముందు జనసేన పార్టీ నియోజకవర్గ ఇం​ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ ఆందోళన చేపట్టారు. బార్​ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

janasena leader sundarapu vijay
జనసేన పార్టీ నియోజకవర్గ ఇం​ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్
author img

By

Published : Dec 31, 2020, 1:57 PM IST

సమయపాలన లేకుండా 24 గంటలు బార్​లో మద్యం అమ్ముతున్నారని ఆరోపిస్తూ.. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలోని ఓ బార్​ ముందు జనసేన పార్టీ నియోజకవర్గ ఇం​ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ ఆందోళన చేశారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు బార్​ ఎదుటే నిరసనకు దిగారు. అధికార పార్టీ నేతకు చెందిన ఈ బార్ అండ్ రెస్టారెంట్​లో రోజంతా మద్యం అమ్మకాలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒక గంటకు ముందే బార్​ మూసివేసినా.. ఆ తర్వాత కూడా బార్​లో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇదే విషయమై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమయపాలన లేకుండా మద్యం విక్రయాలు చేస్తున్న బార్​ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున బార్ వద్దకు చేరుకున్నారు. అదే సమయానికి.. స్థానిక వైకాపా నాయకులు బార్​ వద్దకు చేరుకుని జనసేన కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇరు పక్షాల నాయకులను నిలువరించారు.

ఇదీ చదవండి:

కేంద్రం నిర్ణయంతో... వ్యవసాయ మార్కెట్లకు కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.