విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో పట్టు వీడకుండా నిరహార దీక్షలు చేస్తున్న కార్మికులకు అండగా నిలవడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం విశాఖ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికులను కలిసి సంఘీభావం ప్రకటిస్తారు. అనంతరం సభలో మాట్లాడతారు.
![janasena chief Pawan Kalyan's visit to Visakhapatnam on Sunday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-25-30-janasena-teaser-av-3182025_30102021010742_3010f_1635536262_380.jpeg)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన, స్టీల్‌ప్లాంట్ సభలో పెద్ద సంఖ్యలో విశాఖ వాసులు, జనసేన కార్యకర్తలు పాల్గొనాలంటూ పార్టీశ్రేణులు కరపత్రాలు పంచి పెడుతున్నారు. ఆదివారం జరిగే సభ కోసం ఒక ప్రచార వీడియోను విడుదల చేశారు.
![janasena chief Pawan Kalyan's visit to Visakhapatnam on Sunday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-25-30-janasena-teaser-av-3182025_30102021010742_3010f_1635536262_1046.jpeg)
ఇదీ చూడండి: BADVEL BY-POLL :
నేడు బద్వేలు ఉపఎన్నిక పోలింగ్... ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు