విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం తూటిపాల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 210లో 76.55సెంట్ల భూమి ఉంది. దీంతో పాటు పది ఎకరాల చెరువును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు నాలుగున్నర కోట్లతో అభివృద్ధి చేయించారు. అయితే ఇదే సర్వే నెంబర్లో 10 సంవత్సరాల క్రితం బుచ్చన్న పాలెం గ్రామానికి చెందిన రెడ్డి సన్యాసినాయుడు పేరు మీద మూడు ఎకరాల 50 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు అసైన్ చేసారు.
అయితే ఈ భూమి చాలా కాలం క్రితం నుంచి రావు ఖాతాలో ఉంది. ఈ భూమిని ప్రభుత్వ పెద్దల ద్వారా అక్రమ దారిలో పొందే ప్రయత్నం చేస్తున్నట్లు జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న సూర్యచంద్ర ఆరోపించారు. అధికారుల తీరును నిరసిస్తూ మాకవరపాలెం మండల తాహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఆ తర్వాత మండల కార్యాలయానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ భూ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమగ్ర విచారణ జరిపించేంత వరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: