Jagananna Smart Township: జగనన్న స్మార్ట్ టౌన్షిప్ నిర్మాణం కోసం విశాఖ జిల్లా ఆనందపురం మండలం పాలవలస గ్రామంలో భూ సమీకరణకు అధికారులు ప్రజాభ్రిపాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామస్థులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
పాలవలస పంచాయతీలో మెుత్తం 90 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రకటన జారీ చేసినట్లు ఆర్డీవో వెల్లడించారు. పట్టా కలిగిన రైతులకు అభివృద్ధి చేసిన లే అవుట్లో 900 గజాలు స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. పట్టా లేకుండా రైతు సాగులో ఉంటే 450 గజాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపుతున్నట్లు అధికారులు గ్రామస్థులకు వివవరించారు. దీనిపై స్థానికులు అభ్యంతరం తెలిపారు.
రైతులకు 14 వందల గజాల స్థలాన్ని ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేకుంటే భూములను అప్పగించేది లేదని తేల్చి చెప్పారు. అందరికీ న్యాయం చేస్తేనే భూసేకరణకు ఒప్పుకుంటామన్నారు.
ఇదీ చదవండి: jal shakti ministry meeting: తెలుగు రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర జలశక్తి శాఖ కీలక భేటీ