విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో... ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) పథకం కింద మంజూరైన రహదారులు నిర్మాణానికి సంబంధించి... పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అటవీ, పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు హాజరయ్యారు. పీఎంజీఎస్ వై కింద అనంతగిరిలో 3, పెదబయలు 2, పాడేరు1, జీకే వీధి 15, చింతపల్లి 1 చొప్పున రహదారులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు.
పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ అధికారులు రోడ్డులు వేసేందుకు అవసరమైన సర్వే నిర్వహించాలన్నారు. ఇది పూర్తైన తర్వాత... వచ్చే నెలాఖరులోగా అటవీ శాఖ నుంచి అనుమతులు పొందాలన్నారు. అటవీ శాఖ ఇచ్చిన భూములకు ప్రత్యామ్నాయంగా... వేరే చోట స్థలాలు కేటాయిస్తామన్నారు. తహసీల్దార్లు ఫారం 1 పూర్తి చేసి అటవీ శాఖ సమర్పించాలని సూచించారు. రహదారుల నిర్మాణానికి... అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ఇదీ చదవండి: ముందుంది వృద్ధ భారతం!- పరిరక్షణ మన బాధ్యత