విశాఖ జిల్లా పాడేరు కొవిడ్ ఆస్పత్రిని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆక్సిజన్ నిల్వలు, కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ వంటి అంశాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణారావును అడిగి తెలుసుకున్నారు.
పీపీఈ కిట్లు ధరించి కరోనా వార్డును పరిశీలించారు. వైద్య సేవలు, భోజన సదుపాయం గురించి కరోనా బాధితులతో మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆసుపత్రి సిబ్బందికి తెలియజేశారు.
ఇదీ చదవండి:
కరోనాతో మహిళ మృతి: మృతదేహం ఇవ్వాలని ఆసుపత్రిపై కుటుంబీకుడి దాడి