ETV Bharat / state

'మళ్లీ పుట్టిన గాంధీ'... ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు?: రఘురామ

మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహారీని అధికారులు కూల్చడాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుపట్టారు. కనీసం నోటీసు ఇవ్వకుండా ఇలా చేయటం అన్యాయమని అన్నారు. చిన్న గోడ కట్టినా సహించలేని అధికారులు రాష్ట్రంలో ఉండటం రాష్ట్రానికే గర్వకారణం అని ఎద్దేవా చేశారు.

raghurama krishna raju
raghurama krishna raju
author img

By

Published : Oct 3, 2020, 5:15 PM IST

తెదేపా నేత, మాజీ ఎంపీ సబ్బం హరి నివాస ప్రహరీని విశాఖ మున్సిపల్‌ అధికారులు కూల్చివేయటం అన్యాయమన్నారు వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు. కనీసం నోటీసు ఇవ్వకుండా గోడ కూల్చడం దారుణమని చెప్పారు. శనివారం దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... వైకాపా ప్రభుత్వంపై మరోసారి విమర్శలు సంధించారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వందల కోట్లు అవినీతి జరిగిందని ఎంపీ ఆరోపించారు. ఇంటి నిర్మాణానికి పనికిరాని ఆవ భూములను అధిక ధరలు చెల్లించి అనుయాయులకు లబ్ధి చేకూర్చలేదా? అని ప్రశ్నించారు. సబ్బం హరి ఇల్లు కూల్చివేత స్ఫూర్తిని ఇళ్ల స్థలాల అక్రమార్కులపై ఎందుకు చూపరు అని నిలదీశారు.

ఒక పేపర్ లో గాంధీ మళ్లీ పుట్టారని వ్యాసం రాశారు. అమరావతి రైతుల పట్ల మళ్లీ పుట్టిన గాంధీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?. వారితో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు?. నోటీసులు ఇవ్వకుండా సబ్బం హరి ఇంటి ప్రహరీ కూలగొట్టడం సరికాదు. ఆనాటి గాంధీ అహింసా మార్గంలో వెళితే మళ్లీ పుట్టిన ఈ గాంధీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు?. ఈయన కూడా గాంధేయ మార్గంలోనే వెళ్లాలని కోరుకుంటున్నా. గాంధీ జయంతి నాడే భీమవరంలోని కస్తూర్బా మహిళా కళాశాల పేరు మార్చి గాంధీ అభిమానుల మనోభావాలను దెబ్బతీశారు- రఘరామకృష్ణరాజు, వైకాపా ఎంపీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.