స్పేస్ ఆన్ వీల్స్ పేరుతో ఇస్రో ఆధ్వర్యంలో.. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. బస్సులో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన విద్యార్థులకు.. అంతరిక్షాన్ని కళ్లకు కట్టింది. విక్రమ్ సారాబాయ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ఇస్రో ప్రతినిధులు తెలిపారు. అంతరిక్ష కేంద్రంలో ఉండే ఉపగ్రహం మూలాలను, ఉపగ్రహాలను వాటి కదలికలను విద్యార్థులకు చూపించారు. వాటి పనితీరుతో పాటు.. రాకెట్ లాంచర్ నుంచి ఉపగ్రహం వేరయ్యే విధానం తదితర అంశాలను ఇందులో వివరించారు. విద్యార్థులంతా నేరుగా ఇస్రోకి వెళ్లి వీటిని చూడలేరు కాబట్టే నేరుగా ప్రభుత్వమే ఈ ఏర్పాట్లు చేసిందని ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చూడండి