విశాఖ జిల్లాలోని కోనాం (పాలవెల్లి) జలాశయం నుంచి వరినాట్లకు సాగునీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం ఎగువ ప్రాంతం నుంచి 115 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఆయకట్టు ప్రాంతంలోని వరినాట్లుకు దిగువ, ఎగువ కాలువలకు 150 క్యూసెక్కుల వరకు సాగు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుతం ఉన్న నీటితో ఖరీఫ్ పంటలకు సాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు.
జలాశయం నుంచి ఈ నెల రెండో తేదీన ఆయకట్టు ప్రాంతంలోని వరినాట్లకు సాగునీటిని విడుదల చేశారు. నీటి విడుదల ప్రారంభంలో 99.6 25 మీటర్ల వరకు నీటి మట్టం ఉండేది. ప్రస్తుతం 95.45 మీటర్లకు నీటి మట్టం తగ్గింది. ఆయకట్టు ప్రాంతంలో వరినాట్లు ముగింపు దశలో ఉన్నాయి. ఎగువ ప్రాంతం నుంచి అదనపు నీరు వస్తున్న నేపథ్యంలో ఖరీఫ్ పంటలకు సాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: