ఆడబిడ్డ అంటే కుటుంబానికి తరగని ఆస్తి అని ఆ తల్లిదండ్రులు భావించారు. మహాశక్తి రూపమని అల్లారుముద్దుగా పెంచారు. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఆశలను నిజం చేసింది. సివిల్స్‌లో 127 ర్యాంక్ సాధించి వారు కన్న కలలను సాకారం చేసింది. ఆమె విశాఖకు చెందిన లక్ష్మీ సౌజన్య. తమ కుమార్తె సాధించిన ఈ విజయం తమకు ఎంతో అనందాన్ని ఇచ్చిందని ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచి చదువు అంటే ఇష్టంగా సాధన చేయడం, సివిల్ సర్వీసును సాధించడం ద్వారా విస్తృతంగా సేవ చేసే అవకాశం పొందాలనుకోవడం వంటి లక్ష్యాలను పెట్టుకున్న ర్యాంకర్ లక్ష్మీ సౌజన్య, ఆమె తల్లిదండ్రులు, సొదరునితో ముఖాముఖి.