భాజపా ఆర్థిక విధానాలు దేశ ప్రజాస్వామిక విధానాలకు భంగం కలిగించేలా ఉన్నాయని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ దక్షిణ మధ్య జోనల్ సంయుక్త కార్యదర్శి సురేష్ విమర్శించారు. విశాఖ జీవిత బీమా సంస్థ భవనంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ మహా సభలు నిర్వహించారు. జీవిత బీమా సంస్థ షేర్లను స్టాక్ మార్కెట్లో పెట్టాలనుకోవడం, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని వంద శాతం ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అత్యంత దారుణమని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు మహబూబ్ అన్నారు.
బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడాన్ని నిరసిస్తూ బీమా రంగ ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ విశాఖ డివిజన్ అధ్యక్షురాలు కామేశ్వరి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు సతీష్, విశాఖపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎన్. రమణా చలం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
'ఎన్నికల నియమావళి అతిక్రమించారు.. ఏయూ వీసీపై ఫిర్యాదు చేస్తాం'