Students Missing at Seshachalam Forest : సరదాగా గడిపేందుకు ఎంతో హుషారుగా శేషాచలం వెళ్లిన ఆ విద్యార్థులకు అనుకోని సంఘటన ఎదురైంది. జీవితంలో ఎప్పుడూ చూడని కఠిన సవాల్ ఎదుర్కొవాల్సి వచ్చింది. విషాదయాత్ర కాస్త విషాదాంతంగా ముగిసింది. వాటర్ ఫాల్స్ చూడాలన్న సరదా వారిని చివరికి అడవిపాలు చేసింది. ప్రమాదవశాత్తూ ఒకరు మృతి చెందగా మిగతా విద్యార్థులంతా అడవిలో దారి తప్పిపోయారు. రాత్రంతా ఆ అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కథ మలుపు తిరిగింది.
తిరుపతిలోని SVCE ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మెుదటి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని శేషాచలం అడవులకు నిన్న (శుక్రవారం) వెళ్లారు. ఉదయం శేషాచలం గుంజనా వాటర్ ఫాల్స్ వద్దకు చేరుకున్న యువకులంతా మధ్యాహ్నం వరకూ అటవీ ప్రాంతాన్ని కలియ తిరిగారు. అనంతరం సరదాగా ఈత కొట్టేందుకు గుంజానా వాటర్ ఫాల్స్‌లోకి దిగారు. అయితే జలపాతంలో మునుగుతుండగా ఈత రాక ముగ్గురు మునిగిపోగా అందులో ఇద్దరిని సహచర విద్యార్థులు కాపాడాారు. అయితే సాయిదత్త (26) లోతైన గుండంలోకి వెళ్లిపోవడంతో కాపాడలేకపోయారు.
విశాఖలో నలుగు విద్యార్థుల మిస్సింగ్ - కేసు నమోదు
అనంతరం శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో ఎవరికి విషయం చెప్పాలో అర్థంకాక బోరున విలపించారు. కాసేపటి తర్వాత ఓ విద్యార్థి ఎట్టకేలకు తాము తప్పిపోయినట్లు పోలీసులకు సమాచారం అందించాడు. తామున్న లొకేషన్‌ను పోలీసులకు షేర్ చేశాడు. వెంటనే రైల్వే కోడూరు పోలీసులు, అటవీ శాఖ అధికారులు శేషాచలం అడవుల్లో రెండు బృందాలుగా గాలించి అర్ధరాత్రి ఒంటిగంట సమయానికి విద్యార్థులను గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లటంపై విద్యార్థులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు విచారిస్తున్నారు.
ఏడేళ్ల కిందట అదృశ్యమైన బాలిక - భర్త, కుమారుడితో తల్లిదండ్రుల చెంతకు
అల్లూరి జిల్లాలో విషాదం - జలపాతంలో ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులు గల్లంతు