విశాఖ జిల్లా రావికమతం మండలం తోటకూరపాలెంలో యూరియా బస్తాలు పక్కదారి పట్టించారంటూ వచ్చిన అరోపణలపై వ్యవసాయ శాఖ సహాయక సంచాలకుడు మెహనరావు విచారణ జరిపారు. అరోపణలు ఎదుర్కొంటున్న గ్రామ వాలంటీర్లు లాలం రమణ, పైలా రాజులతోపాటు గ్రామంలో రైతులను విడివిడిగా కలిసి వివరాలను సేకరించారు. వాలంటీర్ రమణ 18 మంది రైతుల పేరున 97 ఎకరాలకు సంబంధించి 208 యూరియా బస్తాలను ఇచ్చారు.
మరో వాలంటీర్ రాజు ఏడుగురు రైతులు 26 ఎకరాలకు గాను 71 బస్తాల యూరియా, రెండు బస్తాల డీఏపీ ఇచ్చిన ట్లు రికార్డుల్లో నమోదు కాగా.. ఎరువులు రైతులకు అందీనది లేనిది రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 10న అధికారులు విచారణకు రాగా వైకాపా తెదేపా వర్గీయుల మధ్య వాదోపవాదాలు జరిగిన మేరకు.. విచారణను వాయిదా వేశారు. దీంతో బుధవారం నాటి విచారణకు పోలీసుల బందోబస్తు నడుమ జరిపారు.
ఇవీ చూడండి: