ETV Bharat / state

ఇండో - టిబెటిన్‌ పోలీసు దళం కానిస్టేబుల్‌ అదృశ్యం

విశాఖ జిల్లా ఆనందపురం మండలం పందలపాక 56వ టిబెటిన్‌ పోలీసు విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్‌ అదృశ్యమయ్యారు. ఆదివారం సాయంత్రం రోల్ కాల్ సమయం నుంచి ఆయన కనిపించలేదని ఆనందపురం పోలీసు స్టేషన్​లో కేసు నమోదైంది.

author img

By

Published : Oct 12, 2021, 1:42 PM IST

indo tibetan constable missing in vishakha

ఇండో-టిబెటిన్‌ పోలీసు దళంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ అదృశ్యమైనట్లు ఫిర్యాదు వచ్చిందని ఆనందపురం సీఐ వై.రవి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... కర్నూల్‌ జిల్లాకు చెందిన బొంత జయ రంగడు(30) ఆనందపురం మండలం పందలపాక 56వ టిబెటిన్‌ పోలీసు దళంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నిర్వహించే రోల్‌కాల్‌ సమయం నుంచి ఆయన కన్పించలేదు. దీంతో సోమవారం సాయంత్రం అసిస్టెంట్‌ కమాండెంట్‌ అజయ్‌ ప్రకాష్‌ ఆనందపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: శ్రీ వరహా లక్ష్మినృసింహ స్వామిని దర్శించుకున్న పెళ్లిసందD చిత్రబృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.