విశాఖలో.. దసరా ఉత్సవాలు ముగింపు అనంతరం సాగర దుర్గ మాతా సముద్ర విహారం వైభవంగా జరిగింది. విజయదశమి ముగిసిన తరవాత ఏకాదశి ఘడియల్లో విశాఖ సముద్ర జలాలలో సాగర దుర్గ మాత విహారాన్ని వేడుకగా నిర్వహించారు. సముద్రం లో విహరించే అరుదైన దేవతగా సాగర దుర్గమ్మ కు విశేష ఖ్యాతి ఉంది. ఏటా నిర్వహించినట్టే.. విశాఖ పోర్ట్ ట్రస్ట్ అమ్మవారి కోసం ప్రత్యేక బోట్ ను సమకూర్చింది.
సాగర దుర్గ పుట్టినిల్లు సముద్ర గర్భంగా భావించి అమ్మవారికి ఈ సాగర విహారం నిర్వహిస్తారు. కార్యక్రమ అనంతరం తిరిగి అమ్మవారు ఆలయానికి చేరుకుంటారు. సముద్ర జలాలలో ఉన్న బోట్లు అమ్మవారికి స్వాగతం పలికాయి. కొవిడ్ నియమాల ప్రకారం కేవలం ఆలయ నిర్వాహకులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: