విశాఖ మన్యంలోని గిరిజన గ్రామాలకు వర్షాకాలంలో వెళ్ళాలంటే... ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులో ఈదుకుంటూ సాహసం చేయాల్సిందే. అరకులోయ నియోజకవర్గం పరిధిలోని డుంబ్రిగుడ మండలంలోని చంపపట్టి, పోతంగి తదితర గ్రామాలకు వెళ్లే మార్గంలోని వంతెన ఏడేళ్ల క్రితం కూలిపోయింది. నాటి నుంచి ఆయా గ్రామాల ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వాగులో ఈదుకుంటూ రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి... తమ ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. వరద ముంచెత్తుతోంది!