విశాఖ జిల్లా అరకులోయ సమీపంలోని డముకు టైడ్ గ్రామాల మధ్య తెలంగాణ బస్సు బోల్తా పడిన సంఘటనలో నలుగురు మృత్యువాత పడిన సంగతి అందరికీ తెలిసిందే. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకుండా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మలుపు వద్ద బండరాళ్ల రక్షణ గోడను ముందుగానే ఢీకొట్టి ఉంటే ప్రాణ నష్టం సంభవించి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు డ్రైవర్ కుడివైపునకు తిప్పడంతో.. రక్షణ గోడను ఢీకొట్టి సుమారు 80 అడుగుల లోయలోకి బస్సు బోల్తా పడిందని..అన్నారు.
ఘటన ప్రదేశాన్ని అరకు ఎమ్మెల్యే చిట్టితోపాటు పోలీసు ఉన్నతాధికారులు రవాణా శాఖ అధికారులు సందర్శించారు. బోల్తా పడిన బస్సు లోయ లోంచి బయటకు తీసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఘటన జరిగిన ఈ సమయంలో వాహనచోదకులు అప్రమత్తమై... బాధితులను బయటకు తీసేందుకు చొరవ చూపడంతో మృతుల సంఖ్య తగ్గింది. ఘటన మరింత రాత్రివేళ జరిగి ఉంటే మరింతగా జరిగి ఉండేదని తెలిపారు. ప్రమాద ఘటన చూసి స్థానికులు అప్రమత్తం కావడంతో బాధితులకు సత్వర వైద్య సేవలు అందాయి
ఇదీ చూడండి. అరకు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం