విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో చికెన్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 15 రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.50 ఉండగా.. ఇప్పుడు రూ. 250కు చేరుకుంది. గత కొద్ది రోజులుగా కరోనా ప్రభావంతో చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. పౌల్ట్రీ రైతులు బ్రాయిలర్ కోళ్లను అతి తక్కువ ధరలకే విక్రయించారు. ఫలితంగా ఫారాల్లో ఉన్న కోళ్ళు అయిపోయాయి. ఈ పరిణామంతో బ్రాయిలర్ కోళ్ళు దొరకక చికెన్ ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: