విశాఖ ఉత్సవ్‌లో భాగంగా విశాఖపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతులీనుతున్నాయి. విశాఖ కింగ్ జార్జి హాస్పిటల్, కలెక్టరేట్, బీచ్ రోడ్ కూడలి ప్రాంతాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. నూతన సంవత్సర వేడుకల వరకు ఈ విద్యుత్ అలంకారం ఇలాగే ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యటకులను ఈ అలంకారాలు ఆకర్షిస్తున్నాయి.
ఇదీ చదవండి: విశాఖ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి అవంతి