ETV Bharat / state

'చంద్రబాబుకు సెక్షన్ 151 కింద నోటీసు ఎలా ఇస్తారు?' - విశాఖ ఘటనపై హైకోర్టు ఆదేశం

ప్రజా చైతన్య యాత్ర కోసం విశాఖ వెళ్లిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు సీఆర్​పీసీ సెక్షన్‌ 151 కింద నోటీసులు జారీ చెయ్యడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పోలీసులు ఇచ్చిన వివరణపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ap high court
ap high court
author img

By

Published : Mar 3, 2020, 4:21 AM IST

ప్రజా చైతన్య యాత్ర కోసం విశాఖపట్నం వెళ్లిన తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులకు సీఆర్‌పీసీ సెక్షన్ 151 కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేసిన విషయంలో పోలీసులు ఇచ్చిన వివరణపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్యక్రమ నిర్వహణకు అనుమతిచ్చిన పోలీసులు... 151 కింద నోటీసు ఎలా ఇస్తారని ఆగ్రహించింది. పోలీసుల వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొంది. తీవ్ర నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న సందర్భంలో ఆ ఘటనను ముందస్తుగా నిలువరించేందుకు సెక్షన్ 151 కింద ఇచ్చే నోటీసును ప్రతిపక్షనేతకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. ప్రమాణపత్రంలో వివరాలు సంతృప్తికరంగా లేకపోవటంతో రాష్ట్ర డీజీపీ హాజరై వివరణ ఇవ్వడానికి ఇది తగిన కేసు అని స్పష్టం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు, చట్ట నిబంధనలను ఏవిధంగా అమలు చేస్తున్నారో చెప్పాలని పేర్కొంది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి , రాష్ట్రంలోని ఎస్పీలందరూ ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

పోలీసులు ఏం చేస్తున్నారు?

విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెదేపా అధ్యక్షుడు, నాయకులు ప్రజల్ని కలిసే కార్యక్రమాలు, శాంతియుత ఆందోళనలు, సమావేశాలకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని, తగిన భద్రత కల్పించాలని కోరుతూ తాడికొండ నియోజకవర్గం తెదేపా మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర నాయకులకు సీఆర్​పీసీ సెక్షన్ 151 కింద నోటీసులు ఇచ్చి అరెస్టు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర డీజీపీ, విశాఖ పోలీసు కమిషనర్ వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తాజాగా జరిగిన విచారణలో పోలీసు అధికారులు కౌంటర్లు దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మాజీ ముఖ్యమంత్రి విశాఖకు వచ్చిన విమానం ఆలస్యం కావటంతో నిరసనకారులు అక్కడికి చేరారని పోలీసులు పేర్కొనడంపై అభ్యంతరం తెలిపారు. విమానాశ్రయం వద్దకు నిరసనకారులు చేరుతుంటే పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సీఆర్‌పీపీ సెక్షన్ 151 కింద నోటీసులు ఇవ్వడాన్ని ఏవిధంగా సమర్థించుకుంటారని అడ్వొకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్​ను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతిపక్ష నేతతో పాటు అనుచరులు పలు ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఏజీ వివరణ ఇచ్చారు.

సంబంధిత కథనం

విశాఖ పర్యటనలో చంద్రబాబు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.