లాక్డౌన్ అనంతరం కొన్ని సడలింపులతో విశాఖ జిల్లాలో హోటళ్లు తెరచుకోనున్నాయి. ఈ నెల 8 నుంచి హోటళ్లు తెరచి వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో... విశాఖ హోటల్ మర్చెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు రెండు వేల హోటళ్లు తెరచుకోనున్నాయి.
కరోనా వ్యాప్తి నివారణ నియమాలు, నిబంధనలు, భౌతిక దూరం పాటిస్తూ హోటల్స్ నడుపుతామని యజమానులు చెబుతున్నారు. ఇంతకుముందులా హోటల్ కి వచ్చే వినియోగదారులు సంఖ్య గణనీయంగా తగ్గుతుందని వారు భావిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా... తిరిగి వ్యాపార నిర్వహణ వల్ల చాల మంది జీవనోపాధికి లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: