ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతం వద్ద పర్యాటకులు.. తేనె టీగల దాడికి గురయ్యారు. కార్తీక మాసం అనంతరం.. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్ఘడ్ తదితర రాష్ట్రాల నుంచి నిన్న పెద్ద సంఖ్యలో యాత్రికులు వచ్చారు. ఆయా ప్రాంతాలకు చెందిన దాదాపు పది మందిపై అవి దాడి చేశాయి.
పర్యాటకులు వంట కోసం ఏర్పాటు చేసిన మంటల పొగ వల్ల.. వ్యూ పాయింట్ దగ్గరున్న తేనె టీగలు చెల రేగాయి. ఒక్కసారిగా యాత్రికుల వైపు దూసుకు రాగా.. పర్యాటకులతో సందడిగా ఉన్న ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి.. తేనె పట్టులను తొలగించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: