విశాఖ మరింత అభివృద్ధి చెందాలని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయనకు.. విమానాశ్రయంలో ఎమ్మెల్సీ మాధవ్, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి నేరుగా పాత సీబీఐ కూడలి మూడోపట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంటున్న.. ఏయూ విశ్రాంత ఆచార్యురాలు సీహెచ్ శాంతమ్మను గవర్నర్ దత్తాత్రేయ కలిశారు. ఆమె ఆరోగ్యం, యోగక్షేమాలపై ఆరా తీశారు.
గురువుకు పాదభివందనం
అనంతరం భాజపా సీనియర్ నేత పీవీ చలపతిరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చలపతిరావుకు దత్తాత్రేయ పాదాభివందనం చేయగా.. ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. చలపతిరావు కుటుంబసభ్యులతో కలిసి దత్తాత్రేయ భోజనం చేశారు. గతంలో వీరిద్దరూ పలు పార్టీ పదవుల్లో కలిసి పనిచేశారు. చలపతిరావును దత్తాత్రేయ తన గురువుగా భావిస్తారు.
తెలుగువారి కంపెనీ భారత్ బయోటెక్ నుంచి కరోనా వ్యాక్సిన్ రావటం మనకు గర్వకారణం. 2020 కరోనాపై విజయం సాధించిన సంవత్సరం. వ్యాక్సిన్‌కు కృషి చేసిన భారత్ బయోటెక్‌ను అందరూ అభినందించాలి- బండారు దత్తాత్రేయ
ఇదీ చదవండి: