విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ.. నివేదిక ఇచ్చే గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైపవర్ కమిటీ నివేదిక సమర్పణకు జూన్ 30వ తేదీ వరకూ గడువు పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు. స్టెరీన్ గ్యాస్ ప్రమాదంపై నివేదిక సమర్పించేందుకు మరికొంత సమయం కావాలని కమిటీ విజ్ఞప్తి చేయటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన హైపవర్ కమిటీ.. గ్యాస్ లీక్ ప్రమాదంపై అధ్యయనం చేస్తోంది. ప్రజల నుంచి ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి ఫిర్యాదులు, వివరాలు సేకరిస్తోంది. వాస్తవానికి ఈ నెల 22వ తేదీతో కమిటీ గడువు ముగిసింది. అయితే కమిటీ అభ్యర్థన మేరకు జూన్ 30 వరకు గడువిచ్చింది. అప్పటిలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఇవీ చదవండి... : 'కమిటీ నివేదిక వచ్చే వరకూ పరిశ్రమ తెరిచేది లేదు'