విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ నివేదిక తయారీ తుది దశకు చేరుకుంది. సభ్యులు ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా వివిధ వర్గాల ప్రజలు, నిపుణుల నుంచి 419 వినతులు, ప్రశ్నలు, ఫిర్యాదులు అందాయి. వాటి ఆధారంగా ప్రశ్నావళి రూపొందించి, వివరణలు కోరుతూ ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులకు పంపించారు. వాటిల్లో కొన్నింటికి సమాధానాలు రాగా... మరికొన్నింటికి ఇంకా అందాల్సి ఉంది. వీటిని పరిశీలించి నివేదికలో పొందుపర్చనున్నారు.
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై తుది దశకు నివేదిక - ఎల్జీ పాలిమర్స్ ఘటన వార్తలు
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ నివేదిక తయారీ చివరి దశకు వచ్చింది. రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది.