BAIL TO JANSENA ACTIVISTS : విశాఖ ఎయిర్పోర్ట్ ఘటనలో అరెస్ట్ అయిన 9 మంది జనసేన నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైకాపా మంత్రులపై దాడి చేశారనే ఆరోపణలతో 70మంది జనసేన నేతలపై విశాఖ పోలీసులు పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అంతకుముందు 61 మందికి బెయిల్ మంజూరు కాగా 9మందికి దిగువ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అరెస్ట్ అయిన జనసేన నేతలు విశాఖ కారాగారంలో ఉన్నారు.
హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరం: జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పార్టీ నేతలకు బెయిల్ మంజూరు చేయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను తామేప్పుడు సంపూర్ణంగా విశ్వసిస్తామని పవన్ వ్యాఖ్యానించారు.
-
న్యాయ వ్యవస్థపైనే నమ్మకం ఉంచాం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/MybLqLjW7V
— JanaSena Party (@JanaSenaParty) October 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">న్యాయ వ్యవస్థపైనే నమ్మకం ఉంచాం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/MybLqLjW7V
— JanaSena Party (@JanaSenaParty) October 21, 2022న్యాయ వ్యవస్థపైనే నమ్మకం ఉంచాం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/MybLqLjW7V
— JanaSena Party (@JanaSenaParty) October 21, 2022
ఇదీ జరిగింది : విశాఖ గర్జన పేరిట ఉత్తరాంధ్ర జేఏసీ విశాఖలో చేపట్టిన కార్యక్రమానికి వైకాపా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మంత్రులు, వైకాపాకు చెందిన కీలక నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరిగిన రోజే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా పవన్‌కు స్వాగతం చెప్పేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జనసైనికులు.. విశాఖ గర్జన ముగించుకుని వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్, వైకాపా కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడికి దిగారు.
ఈ ఘటనలో పోలీసులు 70 మంది జన సైనికులను అరెస్ట్ చేశారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా.. అరెస్టయిన వారిలో 61 మంది నిందితులకు అక్కడికక్కడే బెయిల్ లభించింది. మిగిలిన 9 మందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 9 మంది తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించడంతో పాటు.. పోలీసుల అభ్యర్థన మేరకు వారిని రెండురోజుల పాటు న్యాయవాదుల సమక్షంలో పోలీసు కస్టడీకి అనుమతించింది.
ఇవీ చదవండి: