Polavaram Water Project : విశాఖపట్నానికి మంచినీటి సరఫరా చేసే ప్రాజెక్టు అయ్యే రూ.7,214 కోట్లను పోలవరం మల్టీ పర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు అయ్యే వ్యయం నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. వ్యయాల వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని తెలిపింది. పార్లమెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆదేశాలివ్వలేమని స్పష్టంచేసింది. పార్లమెంట్లో ఇచ్చిన హామీల అమల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని తెలిపింది. వ్యాజ్యాన్ని కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిన్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం. ఈమేరకు ఆదేశాలిచ్చింది.
విశాఖపట్నానికి మంచినీరు అందించే ప్రాజెక్టు అయ్యే రూ.7,214 కోట్ల ఖర్చును పోలవరం ప్రాజెక్ట్ అంతర్భాగంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమలాపురం కే. అగ్రహారానికి చెందిన న్యాయవాది వి.రమేశ్ చంద్ర వర్మ హైకోర్టులో పిల్ వేశారు. న్యాయవాది ఎం.శ్రీరామారావు వాదనలు వినిపించారు. విశాఖ మంచినీటి ప్రాజెక్ట్ వయాన్ని మినహాయించడం ఏపీ విభజన చటం నిబంధనలకు విరుద్ధమన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించి పూర్తి వ్యయం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని పార్లమెంట్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
చెట్లను కొట్టేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి :
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అటవీ, వాల్టా చట్టాలను ఉల్లంఘిస్తూ చెట్లను కొట్టివేసి గృహోపకరణాల తయారీ నిమిత్తం టింబర్ డిపోలకు కలపను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేల అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలంది. కాగా ఈ అంశం పై హైకోర్టు విచారణ జరిపగా.. కొట్టివేతకు ఎవరు పాల్పడుతున్నారో వారి వివరాలు పేర్కొనాలని వ్యాజ్యం వేయడంపై అభ్యంతరం తెలిపింది. చెట్ల నరికివేచకు బాధ్యులెవరో పేర్కొనకపోతే ఆదేశాలు ఏవిధంగా ఇవ్వగలమని కోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. అనంతరం పూర్తి వివరాలతో తాజాగా పిల్ వేసుకునేందుకు పిటిషనర్ కు వెసులుబాటు ఇచ్చింది. దీంతో ప్రస్తుత పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు న్యాయవాదికి వెసులుబాటుకు అవకాశం ఇచ్చింది. ఈ పిల్‌కు సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విచ్చలవిడిగా చెట్ల కొట్టివేతను సవాలు చేస్తూ అనకాపల్లికి చెందిన సామాజిక కార్యకర్త అయ్యల సోమయాజుల రామగణపతిశాస్త్రి హైకోర్టులో పిల్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు కొట్టివేతపై నిషేధం విధించాలని కోరారు. పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.
ఇవీ చదవండి :