సింహాద్రి అప్పన్నస్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్.మానవేంద్రనాథ్ రాయ్ దర్శించుకున్నారు. ఆయనతో విశాఖ జిల్లా జడ్జి జస్టిస్ హరిహరనాథ్ శర్మ, సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ ఎం. శ్రీహరి ఉన్నారు. వారికి దేవస్థానం ఈఓ సూర్యకళ, ఏఈఓ రాఘవ కుమార్ స్వాగతం పలికారు. వేద పండితులు వారందరికీ ఆశీర్వాదం అందించారు. అనంతరం కళ్యాణ మండపాన్ని దర్శించుకున్న జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్.. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంసల జల్లు కురిపించారు.
ఈఓ చక్కగా పనిచేస్తున్నారని.. ఆలయ సుందరీకరణ అద్భుతంగా ఉందని కొనియాడారు. గతంలో ఆలయం, కళ్యాణ మండపానికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోందన్నారు. శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధిబాటలో తీసుకెళ్లాలని ఈఓ సూర్యకళకు సూచించారు.
ఇదీ చదవండి:
రుణాల పేరిట రూ.1,700 కోట్లు మాయం.. వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ డైరెక్టర్ అరెస్ట్
'కలిసి పనిచేస్తేనే అభివృద్ధి.. మొక్కల పరిరక్షణ అందరి బాధ్యత'